రాష్ట్రపతి పదవికి ముగిసిన పోలింగ్
న్యూఢిల్లీః రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ సోమవారం నాడు దేశవ్యాప్తంగా అన్ని చట్టసభల్లో ప్రశాంత జరిగింది. ఉదయం పదిగంటల నుంచి ప్రారంభమై సాయంత్రం అయిదుగంటల వరకు సాగిన పోలింగ్‌లో ఎలక్టోరల్ కాలేజీ సభ్యులగా వున్న వివిధ రాష్ట్రాల అసెంబ్లీల సభ్యులు, ఎంపీలు పాల్గొన్నారు. ఢిల్లీ పార్లమెంట్ భవన్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ప్రధాని వాజ్‌పేయి, ఉపప్రధాని అద్వానీ, స్పీకర్ మనోహర్ జోషి, డిప్యూటీ స్పీకర్ సయీద్, ప్రతిపక్ష నేత సోనియా తదితరులు ఓటు చేశారు.
వన్నె తెస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఒక్క కమ్యూనిస్టులుమినహా అంతా కలాంకే ఓటు వేశారని ఆయన చెప్పారు. వైఎస్ కూడా కలాం రాష్ట్రపతిగా తన విధులను నిష్పాక్షికంగా నిర్వర్తించి ఆ పదవికి వన్నె తేగలరన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఓట్ల లెక్కింపు 18న జరుగుతుంది. అన్ని రాష్ట్రాల నుంచి బ్యాలెట్ బాక్స్‌లను ఢిల్లీ తరలిస్తున్నారు.












Click it and Unblock the Notifications
