అహ్మదాబాద్‌ః గోద్రా దురంతం కేసులో ముగ్గురు నిందితులు తమ తప్పును ఒప్పుకున్నారు. సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలుపై దాడి చేసి పెట్రోలు పోసి నిప్పంటించిన అల్లరి మూకలో తాము కూడా వున్నట్టుగా వారు పోలీసులకు తెలిపారు.
ఫిబ్రవరిలో జరిగిన ఈ సంఘటనలో 58 కరసేవకులు సజీవంగా దహనమైనవిషయం విదితమే. నేరాన్ని అంగీకరించిన ముగ్గురు నిందితులను మహ్మద్ యాకుబ్, హసన్ అహ్మద్ చర్ఖా, రంజాన్‌బిన్ యామిన్‌గా గుర్తించారు. ఇదిలా వుండగా దుండగులురైలును బోగీలోపలి నుంచి పెట్రోల్ పోసి తగలబెట్టారని ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించగా నిందితులు బయటనుంచి తగలబెట్టినట్టుగా చెప్పడం గమనార్హం.