హైదరాబాద్: జీర్ణ దేవాలయాల ఉద్ధరణకు ఒక మాస్టార్ ప్లాన్ రూపొందించినట్లు దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు చెప్పారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో గురువారం మంత్రి ఆవిషయం చెప్పారు.
రాష్ట్రంలోని జీర్ణ దేవాలయాల మరమ్మత్తుకు 29 కోట్ల రూపాయలు అవసరమవుతాయని, ఈ నిధులను మంజూరు చేసినా విడుదల చేయలేకపోతున్నామని ఆయన చెప్పారు. కేంద్రం నుంచి నిధుల సహాయం తీసుకుని దేవాలయాల మరమ్మత్తులను దశలవారీగా పూర్తి చేస్తామని ఆయన అన్నారు. జీర్ణమైన దేవాలయాలను పునరుద్ధరించి యాత్రికులకు అన్ని సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉన్నదని డి. ఉమామహేశ్వర రావు (తెలుగుదేశం) అన్నారు. జీర్ణ దేవాలయాల మరమ్మత్తులకు ఒక కార్యాచరణ ప్రణాళికను చేపట్టాలనికె. చంద్రశేఖర్ రావు (టిఆర్‌ఎస్) ప్రభుత్వాన్నికోరారు. ఎన్. రాజ్యలక్ష్మి (కాంగ్రెస్) కూడా మాట్లాడారు.