న్యూఢిల్లీః కత్తి పట్టుకుని పార్లమెంట్ భవనంలోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నించిన ఒక మహిళను పోలీసులు అరెస్టు చేశారు.
అరెస్టయిన యువతిపేరు సునీత అని పోలీసులు చెప్పారు. కత్తి ఎందుకు వుంచుకుందో చెప్పలేకపోవడంతో పార్లమెంట్ వాచ్ అండ్ వార్డ్ సిబ్బంది ఆమెను ఢిల్లీ పోలీసులకుఅప్పగించారు. కర్ణాటకకు చెందిన సునీత ఒక ఎంపీ ఇచ్చిన పాస్ సాయంతో పార్లమెంట్ భవనంలోకి ప్రవేశించినట్టుగా పోలీసులవిచారణలో వెల్లడించింది.