న్యూఢిల్లీ ః భారత పన్నెండో రాష్ట్రపతిగా ఎన్నికైన అబ్దుల్ కలాంను ఈ ఎన్నికల్లో వామపక్షాల అభ్యర్ధిగా పోటీ చేసిన కాప్టెన్ లక్ష్మీ సెహగల్ అభినందించారు.
తాను ప్రచారం చేసిన లక్ష్యాల సాధనకోసం కృషి చేస్తూనే వుంటానని ఆమె తన మద్దుతుదారులకు హామీ ఇచ్చింది. తన మద్దుతుదారులకు, స్పాన్సర్లకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, రాష్ట్రపతి ఎన్నికల ప్రచారం వల్ల వివిధ వర్గాల ప్రజలను కలుసుకునే అవకాశం లభించిందని ఆమె తెలిపారు. వివిధ రాష్ట్రాల్లో పర్యటించినప్పుడు తాను లేవనెత్తినఅంశాలకు పెద్ద సంఖ్యలో ప్రజలు మద్దతు ఇచ్చారని ఆమె చెప్పారు. లౌకికవిలువల రక్షణ, పేదరికం నిర్మూలన తన లక్ష్యాలని ఆమె చెప్పారు.