ప్రొటోకాల్ పై పోటెత్తిన కాంగ్రెస్
హైదరాబాద్‌ః జిల్లాల్లో అధికారులు ఏ మాత్రం ప్రొటోకాల్ పాటించడం లేదని కాంగ్రెస్ శాసనసభ్యులు ధ్వజమెత్తారు. ఈ అంశంపై శుక్రవారం అసెంబ్లీలో అరగంటకు పైగా గందరగోళ పరిస్థితి నెలకొంది. తమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీలకు ఇచ్చిన గౌరవం స్థానిక అధికారులు ఎమ్మెల్ల్యేలకు ఇవ్వడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్ల్యే జె. కృష్ణారావు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఏ విధంగా ప్రొటోకాల్ పాటించనిదీ ఆయన వివరణలతో సహా సభముందుంచారు. దీంతో కాంగ్రెస్ శాసనసభ్యులు ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు.












Click it and Unblock the Notifications
