విజయవాడః విజయవాడ పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఎన్‌కౌంటర్ మరణించిన బుడ్డా శంతన్ కేసు కొత్త మలుపు తిరిగింది. ఇంటరాగేషన్ సమయంలో శంతన్ ఎదురుతిరగడంతో ఆత్మరక్షణకు కాల్చిచంపినట్టుగా పోలీసులు ప్రకటించిన విషయం విదితమే.
అయితే తమ అనుమతి లేకుండా శంతన్‌ను ఇంటరాగేట్ ఎలా చేశారని ప్రశ్నిస్తూ స్థానిక మేజిస్ట్రేట్ పోలీసులకు నోటీసులుపంపారు. పైగా కేసులో ఇన్వెస్టిగేటివ్ అధికారిగా సిఐ వుండగా ఎస్‌ఐ ఇంటరాగేషన్ జరపడమేమిటని కూడా మేజిస్ట్రేట్ ప్రశ్నించారు. న్యాయస్థానం జోక్యంతో ఈ కేసు మరో మలుపు తిరిగిందని న్యాయవాదులుఅంటున్నారు. న్యాయవాదులు ఇప్పటికే ఈ ఎన్‌కౌంటర్‌పై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నవిషయం విదితమే.