'దురంధర్ 2', 'పుష్ప 2' రికార్డుల్నీ దాటేసిన చిన్న సినిమా.. ఈ రేంజ్ కలెక్షన్స్ ఊహించలే..!
పాన్ ఇండియా వ్యాప్తంగా ఇటీవలి కాలంలో చిన్న సినిమాలదే హవా నడుస్తోంది. సరైన కంటెంట్ తో వస్తే బిగ్ స్టార్స్ లేకుండానే సినిమా ఎంతటి ఘన విజయం సాధిస్తుందో ఇటీవల రిలీజ్ అయిన 'హనుమాన్ అంశ్' మూవీ నిరూపిస్తోంది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలీ బాబా జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేవలం రూ. 2 కోట్లతో నిర్మితమైన ఈ మూవీ ఇప్పటివరకూ రూ. 150 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది.
హనుమాన్ అంశ్ మూవీ రిలీజ్ అయిన 31 వ రోజు కూడా ఏకంగా రూ. 22.75 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. ఈ మూవీ విడుదలయ్యాక ఒక రోజులో అత్యధిక కలెక్షన్లు ఇవే కావడం గమనార్హం. 5 వ వారాంతంలో రూ. 49 కోట్లతో కలెక్షన్ల పరంగా దురంధర్ 2, పుష్ప 2 రికార్డుల్ని సైతం బ్రేక్ చేసినట్లు సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. తెలుగులో ఇరుముడి సినిమాను చూసినట్లు హిందీలో హనుమాన్ అంశ్ చిత్రాన్నిఅక్కడి ప్రేక్షకులు ఆదరిస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం మౌత్ టాక్ తోనే ఈ మూవీ ఇంతటి ఘన విజయం సాధించడం విశేషం అని చెప్పొచ్చు.
ఐదోవారాంతం వసూళ్ల వివరాలు చూస్తే బాలీవుడ్ లో ధురంధర్ పార్ట్ 1 కు రూ. 35 కోట్లు వచ్చాయి. ఛావా సినిమాకు రూ. 22 కోట్లు వచ్చాయి. ఇక స్త్రీ 2 కు రూ. 16 కోట్లు, పుష్ప-2 కు రూ. 14 కోట్లు దక్కాయి. అలాగే ధురంధర్-2 సినిమాకు రూ. 12 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి. అయితే ఈ సినిమాలన్నింటినీ పక్కన పెట్టి ఇప్పుడు హనుమాన్ అంశ్ మూవీ ఐదోవారాంతంలో ఏకంగా రూ. 45 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టడం గొప్ప మైలురాయి అని తెలుస్తోంది. ఇక ఈ మూవీ విదేశాల్లో సెప్టెంబర్ 11న విడుదల కానుంది. ఈ మేరకు ఓవర్సీస్ రైట్స్ ను ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబాలే ఫిల్మ్స్ దక్కించుకుంది. హనుమాన్ అంశ్ చిత్రానికి విశాల్ చతుర్వేది రచన, దర్శకత్వం వహించారు.

ఈ మూవీలో నీమ్ కరోలీ బాబాగా శోభినావ్ సత్య జీవించారు. వీరితో పాటు విహాన్ షెడ్గే, చందన్ కె ఆనంద్, పూర్ణిమ తివారీ, అనిల్ రస్తోగి, గుల్షన్ పాండే తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇక నీమ్ కరోలీ బాబా జీవిత చరిత్రను మొత్తం 3 పార్ట్ లుగా సినిమా తీయనున్నారు. మొదటి పార్ట్ హనుమాన్ అంశ్ లో భాగంగా నీమ్ కరోలీ బాబా చిన్ననాటి జీవితం, తల్లి మరణం తర్వాత దేవుడి కోసం ఇల్లు వదిలి వెళ్లిపోవడం, నార్త్ ఇండియాలో సాగిన ఆధ్యాత్మిక ప్రయాణం తదితర అంశాలు ఉన్నాయి. ఇక తొలి భాగం బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పార్ట్ 2 పనులను అప్పుడే దర్శకుడు ప్రారంభించారు.












Click it and Unblock the Notifications
