న్యూఢిల్లీః భారతీయ జనతా పార్టీ నూతన ప్రధాన కార్యదర్శి, మాజీ కేంద్ర మంత్రిఅరుణ్ జైట్లీకి బిజెపి ఆంధ్రశాఖను అదనపు బాధ్యతగాఅప్పగించారు. కీలకమైన ఆంధ్రప్రదేశ్ పార్టీ వ్యవహారాలను ఇకఅరుణ్ జైట్లీ పర్యవేక్షిస్తారు.
ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న తెలుగుదేశం పార్టీతోస్నేహంగా వుంటూ రాష్ట్రంలో పార్టీని ఎలా అభివృద్ధి చేయాలనేది బిజెపి ఎదుట వున్న కీలకమైనఅంశం. ఈ కష్టతరమైన లక్ష్యసాధన బాధ్యతను పార్టీ అధ్యక్షుడు వెంకయ్య నాయుడుఅరుణ్ జైట్లీకి అప్పగించారు. కత్తిమీద సాము వంటి ఆంధ్రపార్టీ బాధ్యతలను జైట్లీ ఎలా నిర్వహిస్తారనేది వేచి చూడాల్సిందే.