తెలంగాణా కాంగ్రెస్ కమిటీ కోసం పట్టు
హైదరాబాద్‌ః ప్రత్యేకంగా తెలంగాణా కోసం కాంగ్రెస్ కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్ల్యేల ఫోరం డిమాండ్ చేసింది. రాష్ట్రంలో పర్యటిస్తున్న ఎఐసిసి సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ ఛార్జి వయిలార్ రవితో ఫోరం సభ్యులు ఆదివారం సమావేశం అయ్యారు. తెలంగాణాకు ప్రత్యేకంగా పిసిసి ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని వారు నొక్కి చెప్పారు. మరోసారి రాష్ట్రాల పునర్విభజన కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా పార్లమెంటులో ఎన్డీఏ ప్రభుత్వంపై వత్తిడి తీసుకువాల్సిందిగా వారు రవినికోరారు.












Click it and Unblock the Notifications
