సినీ నటి గజాల ఆత్మహత్యా యత్నం
న్యూఢిల్లీ: గుజరాత్ శాసనసభ రద్దుఅంశం సోమవారం పార్లమెంటు ఉభయ సభలను కుదిపేసింది. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడిని డిస్మిస్ చేయాలని, రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు పార్లమెంటు ఉభయ సభలను స్తంభింపజేశాయి.
లోక్‌సభ సోమవారం ఉదయం సమావేశం కాగానే కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి వుయ్ వాంట్ 356 ( 356 నిబంధన కింద రాష్ట్రపతి పాలన విధించాలి), మోడి హటావో, దేశ్ బచావో (మోడిని తొలగించాలి, దేశాన్ని కాపాడాలిఅంటూ నినాదాలు చేశారు. సభ చేపట్టే కార్యక్రమాలనుస్పీకర్ ప్రకటిస్తూ పోవడం, ప్రతిపక్షాల సభ్యులు నినాదాలు ఇస్తూ పోవడం దాదాపు గంటసేపు నడిచింది. జీరో అవర్‌లో కూడా ప్రతిపక్షాల సభ్యులు ఇదేవిషయమై పట్టుబట్టారు. దీంతో స్పీకర్ సభను రెండు గంటల పాటు వాయిదా వేశారు.
ఇదే పరిస్థితి రాజ్యసభలోనూ నెలకొంది. మొదట సభను రెండు గంటల పాటు వాయిదా వేసిన చైర్మన్ కృష్ణకాంత్ ఆ తర్వాత కూడా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో మంగళవారానికి వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications
