వాయలార్‌రవిపై కెసిఆర్ ధ్వజం
హైదరాబాద్: కాంగ్రెస్‌లోని తెలంగాణవాదులపై తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్) అధ్యక్షుడుకె. చంద్రశేఖర్ రావు తీవ్రంగా ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమాన్ని నీరు గార్చే ప్రకటన చేసిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జీ వాయలార్ రవి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన సోమవారంవిలేకరుల సమావేశంలో డిమాండ్ చేశారు.
చంద్రశేఖర్ రావు విమర్శలపై తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేచర్ ఫోరం నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమానికి అనుకూల వాతావరణం ఏర్పడిన పరిస్థితిలో చంద్రశేఖర్ రావు ముందుకు వచ్చారని, ప్రజలు ఇచ్చే తీర్పును అడ్డంపెట్టుకుని చంద్రబాబుతో బేరసారాలకు దిగాలనేది చంద్రశేఖర్ రావు ప్రయత్నమని ఆయనవిలేకరులతో అన్నారు. తెలంగాణ ఉద్యమం పట్ల చంద్రశేఖర్ రావుకు చిత్తశుద్ధి లేదని ఆయనవిమర్శించారు.












Click it and Unblock the Notifications
