హైదరాబాద్: హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో పలు నేరాలతో సంబంధం ఉన్న ల్యాండ్ మాఫియా జి. నర్సింహారెడ్డిని సోమవారం రంగారెడ్డి జిల్లా పోలీసులుఅరెస్టు చేశారు. అతని నుంచి పిస్టల్‌ను, మారణాయుధాలనుస్వాధీనం చేసుకున్నారు.
నర్సింహారెడ్డి పలు భూవివాదాల పరిష్కారంలో కీలక పాత్ర పోషించాడని, అతనికి నక్సల్స్‌తో సంబంధాలున్నాయని రంగారెడ్డి జిల్లా పోలీసు సూపరింటిండెంట్ రామచంద్రరాజువిలేకరులకు చెప్పారు. కూకట్‌పల్లి, నానక్‌రామ్ గుడా ప్రాంతాల్లో పలు భూవివాదాల పరిష్కారంలో అతను పాల్గొన్నట్లు ఎస్‌పి చెప్పారు. కొండలరావుమీద దాడి, చైతన్యలో పేలుడు వంటి పలు కేసుల్లో నర్సింహారెడ్డి నిందితుడని ఆయన చెప్పారు.