పార్లమెంట్‌ ఉభయసభల వాయిదా

న్యూఢిల్లీ ః పార్లమెంట్‌ ఉభయ సభలు సోమవారం నాడు దివంగత ఉపరాష్ట్రపతి కృష్ణకాంత్‌కు ఘనంగా నివాళులర్పించాయి. ఆయన మృతికి సంతాపం ప్రకటించిన తర్వాత ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. లోక్‌సభలో స్పీకర్‌ మనోహర్‌ జోషి, రాజ్యసభలో నజ్మా హెఫ్తుల్లా కృష్ణకాంత్‌ గుణగణాలను, ఆయన దేశానికి చేసిన సేవలను ప్రస్తుతిస్తూ ప్రసంగించారు.

కృష్ణకాంత్‌ మృతివల్ల దేశ రాజకీయాల్లో తీరని లోటు ఏర్పడిందని వారుపేర్కొన్నారు. లోక్‌సభలో యావత్‌ సభ పక్షానస్పీకర్‌ మనోహర్‌ జోషి దివంగత నేతకు ఘనంగా నివాళులర్పించారు. కృష్ణకాంత్‌విద్యార్ధినేతగా, రాజకీయ నాయకునిగా పార్లమెంటేరియన్‌గా చేసినసేవలను ఆయన ప్రస్తావించారు. జీవితంలో ఆఖరు క్షణం వరకు నిఖార్సైన గాంధేయవాదిగా ఆయన జీవించారని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ నజ్మా హెఫ్తుల్లా కొనియాడారు. లక్ష్యంతో పాటు లక్ష్యాన్ని చేరుకుని మార్గాలకు కూడా ఆయన సమాన ప్రాధాన్యత ఇచ్చారనిఅందువల్ల చరమాంకం వరకు విలువలకు, సిద్ధాంతాలకు కట్టుబడి వున్నారని ఆమె చెప్పారు. ఉభయ సభలు రెండు నిమిషాల పాటు మౌనం పాటించి సంతాపం ప్రకటించాయి.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+