ఆంధ్రలో 836 మండలాల్లో కరవు
హైదరాబాద్‌ః ఆంధ్రప్రదేశ్ లో 836 మండలాలలను కరవు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారధ్యంలో గురువారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో కరవు పరిస్థితిని చర్చించారు. రాష్ట్రంలో 80 శాతం మండలాలు తీవ్ర దుర్భిక్షంతో కొట్టుమిట్టాడుతున్నాయని మంత్రివర్గం అభిప్రాయపడింది. కరవుతోఅల్లాడుతున్న రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిందిగా కేంద్రాన్ని కోరింది.
కరవు పరిస్థితితో పాటు కలెక్టర్ల సమావేశంలో లేవనెత్తిన పలుఅంశాలను కూడా ఈ సందర్భంగా చర్చించారు. ముఖ్యమంత్రి గతంలో చేసిన హామీలను ఇంతవరకు నెరవేర్చలేక పోయారంటూ కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తున్నదని క్యాబినెట్ అభిప్రాయ పడింది.












Click it and Unblock the Notifications
