ఒంగోలుః ప్రకాశం జిల్లాలో గురువారం నాడు జరిగిన ఒక ఎన్‌కౌంటర్‌లో ఒకమహిళతో సహా ఐదుగురు నక్సలైట్లుమరణించారు. ప్రకాశం, మహబూబ్‌నగర్ జిల్లాల మధ్య ఎర్రగుంటపాలెం నల్లమల అటవీ ప్రాంతంలో గురువారం వేకువజామున ఈ ఎన్‌కౌంటర్ జరిగింది.
మృతులు పీపుల్స్‌వార్ గ్రూప్ నక్సల్స్ అని పోలీసులుపేర్కొన్నారు. నల్లమల అడవుల్లో పీపుల్స్‌వార్ గ్రూప్ నక్సల్స్ సాయుధ శిక్షణా శిబిరాన్ని నిర్వహిస్తున్నట్టుగా సమాచారంఅందడంతో పోలసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ సందర్భంగా ఎదురుపడిన నక్సలైట్లు లొంగిపోవల్సిందిగా హెచ్చరించారు. అయితే నక్సలైట్లు కాల్పులు జరపడంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారని పోలీసులు చెప్పారు. ఎదురుకాల్పుల్లో మరణించిన నక్సలైట్లలో ఒకరిని జిల్లా కమిటి సభ్యుడు లింగన్నగా గుర్తించారు. మరో 31 మంది నక్సలైట్లు తప్పించుకుపోయినట్టుగా తెలిసింది. తప్పించుకుపోయిన నక్సల్స్ కోసంపెద్దఎత్తున గాలింపు చేపట్టారు. హైదరాబాద్ నుంచిపెద్దఎత్తున గ్రౌహౌండ్స్ దళాలు నల్లమల ప్రాంతంలో కృష్ణాతీరానికి చేరుకున్నాయి.