30 మంది విద్యార్థులకుఅస్వస్థత
నల్గొండః నల్గొండ జిల్లా వలిగొండ మండల బిసి హాస్టల్ లో కలుషిత ఆహారం తిన్న 30 మందివిద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గురువారం ఉదయం 60 మందివిద్యార్థులు భోజనం చేశారు. అన్నం వండేందుకు ఉపయోగించిన బియ్యం, చింతపండు నాసిరకంగా వున్నాయి. ప్రభుత్వం బియ్యం ఇవ్వగా పిల్లలకు నూకల అన్నం వండారు. పులుసు వండేందుకు ఉపయోగించిన చింతపండు బాగాపాడైపోయిం వుందని, ఆహారం కలుషితం కావడానికి అదే కారణంఅయివుంటుందని అధికారులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications
