సిఎం హామీలపై వైఎస్ ఉద్యమభేరి
కడపః ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత ఏడేళ్లుగా రాష్ట్రప్రజలకు పలు హామీలి ఇచ్చారని, వాటిలో పది శాతం కూడా నెరవేర్చలేదంటూ వై.ఎస్.రాజశేఖర రెడ్డి ధ్వజమెత్తారు. నెరవేరని ముఖ్యమంక్రి హామీలపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపట్టనున్నట్లు సి.ఎల్.పి. నేతఅయిన వై.ఎస్. వెల్లడించారు. బుధ, గురువారాల్లో ఆయన కడపలో విస్తృతంగా పర్యటించి శంఖుస్థాపనలతో నిలిచిపోయిన వివిధ ప్రాజెక్టులను పరిశీలించారు. నెరవేరని సిఎం హామీలపై ఈ రెండేళ్ళలో విస్తృతంగా ఉద్యమాన్ని చేపట్టనున్నట్లు ఆయనవివరించారు.
వై.ఎస్. ఇలా ఉద్యమభేరి మోగించగా తెలుగుదేశం పార్టీ మాత్రం ఆయనవిమర్శలను తేలిగ్గా కొట్టిపారేసింది. ఏ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా రాష్ట్రాన్ని ఏడేళ్ళు పరిపాలించలేదు... మమ్మల్ని చూసి కళ్ళు కుట్టి ఇలా దుష్ప్రచారం చేస్తున్నారని సమాచారం శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డివిమర్శించారు. సి.ఎం. ఇచ్చిన హామీల్లో 80 శాతం హామీలను నెరవేర్చామని,మిగిలిన హామీలను కూడా నెరవేర్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications
