ఎన్నికల బిల్లుపై అఖిలపక్షం
న్యూఢిల్లీః ఎన్నికల సంస్కరణలకు సంబంధించి ప్రభుత్వం రూపొందించిన ముసాయిదా బిల్లుపై శుక్రవారం నాడు అఖిలపక్ష సమావేశం జరుగుతుంది. అద్వానీ సారథ్యంలో జరిగే ఈ సమావేశంలో ముసాయిదా బిల్లులోని వివిధ అంశాలను చర్చించడంతో పాటు వివిధ పార్టీల సలహాలను తీసుకుంటారు.
రాజకీయ పార్టీలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి, ఎన్నికల కమిషన్ మార్గ దర్శక సూత్రాలను వ్యతిరేకిస్తున్నట్టుగా ప్రకటించాయి. ప్రత్యామ్నాయంగా ప్రభుత్వమే చట్టం తేవాలని కూడా అన్ని పార్టీల సభ నిర్ణయించింది. ఈ మేరకు యుద్ధప్రాతిపదికన ప్రభుత్వం బిల్లును తయారు చేసింది.












Click it and Unblock the Notifications
