వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెట్రోల్‌ బంకులపై దుమారం

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః పెట్రోలు బంకులను, గ్యాస్‌ ఏజెన్సీలను ప్రభుత్వం అధికార పక్షానికి చెందిన వారికి నిబంధనలకు విరుద్దంగా కేటాయిస్తున్నారనే ఆరోపణలతో లోక్‌సభ దద్దరిల్లింది. ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్‌ సభ్యుడు ప్రియరంజన్‌దాస్‌ మున్షీ ఈ ఆరోపణలు చేశారు. పలు రాష్ట్రాల్లో అధికార పక్షానికి ఇదో బిజినెస్‌గా మారిందని ఆయన చెప్పారు.

మొత్తం ఫైళ్లను సిబిఐకి అప్పగించి దర్యాప్తు జరపాలని అప్పటి వరకు ఈ కేటాయింపులను ఆపాలని ఆయన డిమాండ్‌ చేశారు. అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. ఈ దశలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రమోద్‌ మహాజన్‌ జోక్యం చేసుకుని, సంబంధిత మంత్రి సభలో లేరని అందువల్ల ఈ అంశాన్ని వాయిదా వేయాలని సూచించారు. అయితే విపక్షాలు అందుకు తిరస్కరించాయి. దాంతో కొద్ది సేపు గొడవ జరిగింది. స్పీకర్‌ విజ్ఞప్తి మేరకు ప్రశ్నోత్తరాల సమయం కొనసాగడానికి విపక్షాలు అంగీకరించడంతో గొడవ సద్దుమణిగింది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X