ఆంధ్రవీరునికి బాష్పాంజలి
హైదరాబాద్‌ః కాశ్మీర్ ఎన్ కౌంటర్ లో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కెప్టెన్ వీరరాజి రెడ్డికి భాగ్యనగర వాసులు కన్నీటి వీడ్కోలు పలికారు. వందలాది మంది అభిమానులు, మంత్రులు, నగర ప్రముఖులు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన భౌతిక కాయాన్ని శుక్రవారం విమానంలో హైదరాబాద్ తీసుకువచ్చారు. అక్కడి నుంచి ఊరేగింపుగా ఆయన భౌతిక కాయాన్ని హబ్సిగూడలోని నివాసానికి తరలించారు. అక్కడ ఆయన భౌతికకాయాన్ని పలువురు సందర్శించారు.
నల్గొండ జిల్లా యాదగిరి గట్ట మండలంసైదాపూర్‌కు చెందిన 26 ఏళ్ల వీరరాజిరెడ్డి బాల్యం విద్యాభ్యాసంఅంతా హైదరాబాద్‌లోనే జరిగింది. ఆయనకు మూడు నెలల క్రితమేవివాహమయింది. తండ్రి కొండల్‌రెడ్డి అడ్వోకేట్‌గా పనిచేస్తున్నారు. చదువులో చిన్నప్పటి నుంచి చురుగ్గా వుండే రాజిరెడ్డి ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్‌లో మంచి రాంక్‌తోసీట్ వచ్చినప్పటికీ ఎన్‌డిఎలో చేరారు. గత ఏప్రిల్‌లో శంకర్‌మఠ్ ప్రాంతానికి చెందిన వర్ష అనే యువతితోవివాహం జరిగింది. పెళ్లయిన పదిరోజులకే డ్యూటీలో చేరిన వీరరాజిరెడ్డి ఈ మధ్య తండ్రి ఆరోగ్యం బాగాలేకపోవడంతో వచ్చి చూసివెళ్లారని ఆయన బంధువులు చెప్పారు. రాజిరెడ్డి మరణ వార్త తెలిసిన మరుక్షణం నుంచి ఆయన తల్లితండ్రుల దుఃఖం పట్టశక్యం కాకుండా వుంది. రాజిరెడ్డి వారికిఏకైక కుమారుడు. ఇద్దరు కుమార్తెల్లో ఒకరి పెళ్లయింది. మరో కుమార్తె మెడిసిన్ చదువుతున్నారు. వారి రోదన చూపరులను కలిచివేస్తున్నది. మరోవైపు రాజిరెడ్డి అత్తగారింటిలో కూడా తీవ్రమైనవిషాదం నెలకొని వుంది. బంధువులంతా హైదరాబాద్‌లోనే వుండటంతో వారంతా వార్త తెలిసిన కొద్దిసేపట్లోనే హబ్సిగూడలోని కొండలరెడ్డి ఇంటికి చేరుకున్నారు.












Click it and Unblock the Notifications
