మధ్యాహ్నభోజనపథకం మేలుః రంగరాజన్
విజయవాడః మధ్యాహ్న భోజన పథకం వంటి ఆకర్షణీయ పథకాలను ప్రవేశపెట్టడం ద్వారా అక్షరాస్యతనుపెంపొందించాలని గవర్నర్ రంగరాజన్ పిలుపునిచ్చారు. చదవుల
పండగ సందర్భంగా శుక్రవారం ఆయన కృష్ణా జిల్లా గన్నవరం జడ్.పి. హైస్కూల్ లో మధ్యలో చదువు మానేసినవిద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రంగరాజన్ మాట్లాడుతూ వివిధ కారణాల వల్ల మధ్యలో బడి మానేసే వారికివిద్యా బుద్ధులు నేర్పించే లక్ష్యంతో చదువుల పండుగను నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ పధకంపట్ల ఆసక్తి కలిగించేందుకు మధ్యాహ్న భోజన పధకం వంటి పధకాలను ప్రారంభించాలని ఆయన సూచించారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా వున్న సమయంలో తెలుగుదేశం ప్రభుత్వం మధాహ్న భోజన పథకాన్ని ప్రారంభించి ఆ తరువాత రద్దు చేసినవిషయం విదితమే.












Click it and Unblock the Notifications
