చిన్నారి బలి-చలించిన బాబు
హైదరాబాద్‌ః మృత్యువు మనకు ఎంత సమీపాన వున్నదో ఊహించుకుంటే వెన్నులోనుంచి వణుకు పుడుతుంది.ట్రాన్స్ కో అధికారుల పుణ్యమా అని రోడ్లపై నిర్లక్ష్యంగా వదిలేసిన కరెంట్ తీగలు ఓ బాలిక పాలిట మృత్యుపాశమైంది. చందన బ్రదర్స్ వారి పాంప్లెట్స్ ఎరుకొనేందుకుట్రాన్స్ ఫార్మర్ సమీపంలోకి వెళ్ళిన దోమలగూడ బండానగర్ కు చెందిన ఎనిమిదేళ్ళ నందనికి కరెంట్ షాక్ తగిలింది. శనివారం సాయంత్రం ఈ విషాద సంఘటన జరిగింది.
ఈ విషాద దృశ్యాలను టెలివిజన్ లో చూసిన చంద్రబాబు నాయుడు చలించిపోయారు. వెంటనే నందిని కుటుంబానికి లక్ష రూపాయలఎక్స్ గ్రేషియా ప్రకటించారు. కంచెలేకుండాట్రాన్స్ ఫార్మర్ ను నిర్లక్ష్యంగా వదిలేసిన అధికారులపై చర్యకు ఆదేశించారు. లక్ష రూపాయలఎక్స్ గ్రేసియా ప్రకటించడం మంచిదే...ట్రాన్స్ కో నిర్లక్ష్యం సాక్షిగా పోయిన నందిన ప్రాణం మాత్రం తిరిగి రాదేమో?












Click it and Unblock the Notifications
