కరవుపై కాంగ్రెస్,లెఫ్ట్ ఆందోళన
హైదరాబాద్‌ః కరవుతో అల్లాడుతున్న రాష్ట్ర ప్రజానీకాన్ని ఆదుకోవడంలో తెలుగుదేశం ప్రభుత్వంఘోరంగా విఫలం అయిందని కాంగ్రెస్ వామపక్షాలు అభిప్రాయ పడ్డారు. రైతుల సంఘాలు, ప్రజలను కలుపుకొని ప్రభుత్వంపైపెద్దఎత్తున ఉద్యమాన్ని చేపట్టాలని వామపక్షాలు అభిప్రాయ పడ్డాయి.ఒకవైపు కరవుతో రైతులు విలవిలలాడిపోతుంటే కరెంట్ బిల్లుల కోసం ప్రభుత్వం ఒత్తిడి చేయడం అన్యాయం అని వై.ఎస్. ఆగ్రహం వ్యక్తం చేశారు.
కరవునుంచి ప్రజలను ఆదుకోలేని ప్రభుత్వంపై ప్రత్యక్ష ఆందోళనకు దిగాలని సిపిఎం సూచించగా త్వరలో పిసిసి నేత ఎమ్మెస్సార్ ఆధ్వర్యంలో మరో అఖిలపక్షం ఏర్పాటు చేసి తుదినిర్ణయం తీసుకుంటామని వైఎస్ చెప్పారు.
రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితులపై చర్చించేందుకు కాంగ్రెస లెజిస్లేచర్ పార్టీ(సిఎల్‌పి) నేత డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి సోమవారం అఖిల పక్ష సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సమావేశానికి సిపిఐ, సిపింఎ నాయకులుహాజరయ్యారు.












Click it and Unblock the Notifications