ఇదేం పోస్టర్ అయ్యా..షూటింగ్‌కు ముందే సెన్సేషన్!

విలక్షణ నటుడు జేడీ చక్రవర్తి మళ్లీ తనదైన శైలిలో వెండితెరపై మ్యాజిక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా, ఒళ్లు గగుర్పొడిచే బాణామతి బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తాజాగా ''చేతబడి" అనే పవర్ ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు మేకర్స్.

హీరోగా, విలన్‌గా డ్యూయల్ షేడ్స్?
ఇటీవలే జేడీ చక్రవర్తి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలోని ఆయన పాత్రకు సంబంధించి చిత్ర బృందం అప్‌డేట్ ఇచ్చింది. ఈ సినిమాలో జేడీ మునుపెన్నడూ చూడని సరికొత్త అవతార్‌లో కనిపించబోతున్నారు. విశేషమేమిటంటే.. ఆయన ఇందులో హీరోగాను, విలన్‌గాను రెండు భిన్నమైన పార్శ్వాలున్న పాత్రలో మెప్పించబోతున్నారని సమాచారం. జేడీ మార్క్ యాక్టింగ్ ఈ హారర్ మిస్టరీకి ప్రధాన బలమని తెలుస్తోంది.

JD Chakravarthy Horror Thriller Chethabadi Movie Creates Sensation Before Shooting Starts Details

సరిగమ సృష్టించిన సరికొత్త రికార్డ్
ఈ సినిమా ఇంకా రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభించుకోకముందే ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రముఖ మ్యూజిక్ సంస్థ సరిగమ (Saregama) ఈ చిత్రానికి సంబంధించి ఐదు భాషల ఆడియో రైట్స్‌ను భారీ ధరకు దక్కించుకుంది. సాధారణంగా ఒకే ట్యూన్‌ను ఐదు భాషల్లో పాడుతుంటారు. కానీ ఈ సినిమాలో ఒక విజువల్‌కు తెలుగులో ఒక పాట ఉంటే, మిగిలిన భాషల్లో వేర్వేరు పాటలు (డిఫరెంట్ ట్యూన్స్) ఉండబోతున్నాయి. ఇలాంటి ప్రయోగం సౌత్ సినిమాలో ఇదే తొలిసారి కావచ్చు!

వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతుండటంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.బాణామతి నేపథ్యంలో సాగే కథాంశం ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసేలా హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో రూపొందుతోంది.త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. మునుపటి చిత్రాల్లో తన వైవిధ్యమైన నటనతో ఆకట్టుకున్న జేడీ చక్రవర్తి, ఈ 'చేతబడి'తో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తారో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+