బీజేపీకి లడ్డులా దొరికిన విజయ్, ఆట మొదలు..!!

తమిళనాట ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. త్రిముఖ పోరు హోరా హోరీగా మారుతోంది. ఈ ఎన్నికల్లో హీరో విజయ్ ప్రభావం పైన పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. డీలిమిటేషన్ వ్యవహారాన్ని డీఎంకే సెంటిమెంట్ అస్త్రంగా మార్చుతోంది. ఈ వ్యవహారంలో ఎన్డీఏ ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తోంది. ఇదే సమయంలో విజయ్ వేస్తున్న ప్రతీ అడుగు ఆసక్తి కరంగా మారుతోంది. ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న వేళ విజయ్ తాజా నిర్ణయం ప్రత్యర్థులకు అస్త్రంగా మారుతోంది. తెలంగాణ సీఎం రేవంత్ హామీలే తన అస్త్రాలుగా విజయ్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది.

తమిళనాడు ఎన్నికల వేళ టీవీకే మేనిఫెస్టో ను విజయ్ విడుదల చేసారు. ఇందులో ఆకర్షణీయ పథకాలను ప్రకటించారు. అయితే, కొత్త తరహాలో హామీలను.. విధానాలను వెల్లడిస్తారనే అంచనాల వేళ విజయ్.. ఇతర పార్టీల హామీలనే తాను ఇస్తానని చెప్పటం ద్వారా రాజకీయంగా కొత్త చర్చ మొదలైంది. యువత, కొత్త ఓటర్లు, తటస్థులు విజయ్ వైపు చూస్తున్నట్లు తాజాగా సర్వే లు వెల్లడించాయి. అయితే, విజయ్ ఇతర పార్టీల హామీలే కాపీ కొట్టారా అనే విధంగా తన మేనిఫెస్టో ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రకటనలను గుర్తు చేస్తున్నాయని అంటున్నారు. కొన్ని చిన్న మార్పులతో తెలంగాణ కాంగ్రెస్ మ్యానిఫెస్టోనే విజయ్ ప్రకటించారనే చర్చ ఇప్పుడు మొదలైంది. విజయ్ తన మేనిఫెస్టోలో ప్రతి కుటుంబానికి ఏడాదికి ఆరు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ప్రకటించారు.

తమిళనాట విజయ్ నిశ్శబ్ద విప్లవం, వారంలో మారిన లెక్కలు - గ్రౌండ్ రిపోర్ట్..!!
తమిళనాట విజయ్ నిశ్శబ్ద విప్లవం, వారంలో మారిన లెక్కలు - గ్రౌండ్ రిపోర్ట్..!!
vijay-s-tvk-echoes-dravidian-playbook-sparks-fresh-political-debate-amid-tamil-nadu-assembly-electi

కాంగ్రెస్ హామీలనే కాపీ కొట్టారనే రాజకీయ చర్చ

అదేవిధంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, నిరుపేద యువతుల వివాహానికి 8 గ్రాముల బంగారం తదితర హామీలను ప్రకటించారు. అదేవిధంగా 60 ఏళ్ల లోపు వయసున్న మహిళలకు బ్యాంకు ఖాతాలో రూ.2,500 నగదు జమ చేస్తామని, ప్లస్-2 వరకు చదువుకునేందు కోసం విద్యార్థులకు ఏటా రూ.15 వేల ఆర్థిక సాయం. ఆ తర్వాత ఉన్నత చదువులకు రూ.20 లక్షల విద్యారుణం ప్రకటించారు. తెలంగాణలో పేద యువతుల వివాహానికి తులం బంగారం ఇస్తామని ప్రకటించగా, విజయ్ మాత్రం 8 గ్రామాలు ఇస్తామని ప్రకటించారు. అదేవిధంగా తెలంగాణలో గ్యాస్ సిలిండర్లకు రూ.500 రాయితీ ఇస్తున్నారు. విజయ్ మాత్రం ఏటా 6 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ప్రటించారు. రైతు రుణమాఫీ విషయంలో సైతం తెలంగాణలో రేవంత్ ఇచ్చిన హామీలే ప్రస్తావన చేసినట్లుగా విమర్శలు మొదలయ్యాయి. దీంతో.. ఈ మేనిఫెస్టో ఎన్నికల్లో విజయ్ కు ఎంత వరకు కలిసి వస్తుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+