ఇస్లామాబాద్‌ః ఇస్లామాబాద్ లోని ఒక క్రిస్టియన్‌మిషినరీ పాఠశాలపై మిలిటెంట్లు దాడి జరిపారు. ఈ దాడిలో ఇద్దరువిద్యార్ధులతో సహా ఐదుగురు దుర్మరణం పాలయ్యారు.
ఇస్లామాబాద్ కు ఈశాన్య భాగంలో 40 కిలోమీటర్లదూరంలో వున్న ముర్రీపట్టణంలో వున్న క్రిస్టియన్‌మిషనరీ స్కూల్ పై మిలిటెంట్లు సోమవారం ఉదయం ఆరుగంటల ప్రాంతంలో మెరుపుదాడి చేశారు.విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. మిలిటెంట్లు జరిపిన కాల్పుల్లో ఇద్దరు భద్రతా సిబ్బంది, ఒక వంటమనిషి కూడా మరణించారు. ఈ సంఘటన పాకిస్తాన్ లో సంచలనం సృష్టించింది.