న్యూఢిల్లీ:పెట్రోల్ పంపుల కేటాయింపులో అక్రమాలకు బాధ్యత వహించిపెట్రోలియం శాఖ మంత్రి రామ్‌నాయక్ తన మంత్రిపదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు పార్లమెంటు ఉభయ సభల్లో పట్టుబట్టాయి. దీంతో ఉభయ సభల్లోనూ కార్యకలాపాలు స్తంభించాయి.
ప్రతిపక్షాలు తమ పట్టు వీడకపోవడంతో రాజ్యసభ డిప్యూటీ చైర్‌పర్సన్ నజ్మా హెప్తుల్లా సభను మంగళవారంనాటికి వాయిదా వేశారు. మంత్రి రామ్‌నాయక్ ఒక ప్రకటన చేస్తానని తనకు లేఖ రాశారని, ప్రశ్నోత్తరాల సమయాన్ని కొనసాగనివ్వాలని నజ్మా హెప్తుల్లావిజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. లోక్‌సభస్పీకర్ మనోహర్ జోషి కూడా సభను మంగళవారంనాటికి వాయిదా వేశారు.పెట్రోల్ పంపుల కేటాయింపు వ్యవహారంపై ప్రతిపక్షాలు పట్టుబడుతుండడంతో ప్రత్యక్ష ప్రసారాన్ని ఆపేయాలనిస్పీకర్ ఆదేశించారు. తన బంధువులకు, సన్నిహతులకు మంత్రి రామ్‌నాయక్‌పెట్రోల్ బంకులు కేటాయించారని ప్రతిపక్షాలు ఉభయ సభల్లోనూవిమర్శించాయి.