పటేల్‌అరెస్టుపై భిన్న కథనాలు
హైదరాబాద్: నిషిద్ధపీపుల్స్‌వార్ ముఖ్య నాయకుడు పటేల్ సుధాకర్ రెడ్డిఅరెస్టు కాలేదని పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండ పాలెం మండలంలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లోపీపుల్స్‌వార్ దళ సభ్యులు నలుగురు మృతి చెందినవిషయం తెలిసిందే. మిగిలినవారు నల్లమల కీకారారణ్యంలోకి పారిపోయారు.వీరిలో పటేల్ సుధాకర్ రెడ్డి, మరో ముఖ్యుడు గుంటూరు జిల్లావిజయపురి సౌత్ వద్ద పోలీసులకు చిక్కినట్లు వార్తలు వెలువడ్డాయి.
తమ కుమారుడైన పటేల్ సుధాకర్ రెడ్డిని పోలీసులు నిర్బంధించారని, ఎన్‌కౌంటర్‌పేరుతో తమ కుమారుడిని హతమార్చే ప్రమాదం ఉన్నదని సుధాకర్ రెడ్డి తలిదండ్రులు బొజ్జమ్మ, పటేల్ వెంకటరామి రెడ్డి ఆదివారం గద్వాలలోవిలేకరులతో అన్నారు. వెంటనే తమ కుమారుడిని కోర్టులోహాజరు పరచాలని వారు డిమాండ్ చేశారు. తమ కొడుకు ఏదైనా తప్పు చేశాడని భావిస్తే చట్ట ప్రకారం శిక్షించాలని వారన్నారు. తమ కుమారుడుఅరెస్టయినట్లు కొన్ని పత్రికల్లో వార్తలు రావడమే కాకుండా ఇతర మార్గాల ద్వారాఅరెస్టు వార్తను ధృవీకరించుకున్నామని వారన్నారు.












Click it and Unblock the Notifications