పెట్రోల్ డీలర్ షిప్ లు రద్దు
న్యూఢిల్లీః 2000 జనవరి తరువాత జరిగినపెట్రోల్ పంపులు, గ్యాస్, కిరోసిన్ ఏజెన్సీల కేటాయింపులను రద్దు చేశారు. ప్రధాని అటల్‌బిహారీ వాజ్ పేయి సోమవారం ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ వ్యవహారంపైపెనువివాదం చెలరేగిన దరిమిలా 2000 జనవరి నుంచి జరిగినపెట్రోలు బంకుల కేటాయింపున్నీ రద్దు చేయాలని ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో ఆదేశించించింది.
వేలంపాటల ద్వారా అన్ని ఏజెన్సీలను ఖరారు చేయడం జరుగుతుందని, ప్రస్తుతం రద్దు చేసిన వాటిన తిరిగి కేటాయించేఅంశాన్ని సంబంధింత మంత్రిత్వ శాఖ పరిశీలిస్తుందని ప్రధాని కార్యాలయం తెలిపింది.
ఇప్పటి వరకు జరిగిన కేటాయింపులను ప్రధాని కార్యాలయం పునఃపరిశీలిస్తుందని, కార్గిల్ యుద్ధవీరుల కుటుంబాలకు కేటాయించిన డీలర్ షిప్ లు రద్దు కావని ప్రధాని కార్యాలయం స్పష్టం చేసింది. ప్రధాని కార్యాలయం ప్రకటన వెలువడడానికి ముందు వాజ్‌పేయి క్యాబినెట్ సీనియర్ సహచరులతో సమావేశమయ్యారు. పార్లమెంటులో ఈ వ్యవహారంపైపెద్దఎత్తున దుమారం చెలరేగుతున్న దరిమిలా ఈ సంచలన నిర్ణయాన్నిగైకొన్నారని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications