శ్రీనగర్: అమర్నాథ్ యాత్రికులుపైమిలిటెంట్లు మంగళవారం తెల్లవారుజామున దాడి చేసి9 మందిని బలిగొన్నారు. మరో 31 మందిని గాయపరిచారు.
పహల్గామ్ సమీపంలోని బేస్ క్యాంప్‌లో నిద్రిస్తుండగా యాత్రికులపైమిలిటెంట్లు దాడి చేశారు. యాత్రికులకు ఇది ప్రధానమైనవిరామ కేంద్రం. అమర్నాథ్ యాత్రికులపై మిలిటెంట్లు చేసిన తొలిపెద్ద దాడి ఇదే. భద్రతాదళాలు అప్రమత్తమై మిలిటెంట్లపై ఎదురుదాడి చేశాయి. ఈ కాల్పుల్లో ఒక మిలిటెంట్ మరణించారు. గాయపడిన యాత్రికులను హెలికాప్టర్ లలో ఆస్పత్రులకు తరలించారు.