నిర్ణయం మార్చుకున్న లారెన్స్, విజయ్ ప్రతిపాదన తో..!!
రాఘవ లారెన్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కొద్ది రోజులుగా రాఘవ లారెన్స్ పొలిటికల్ ఎంట్రీ.. సీఎం విజయ్ వదులుకున్న తిరుచ్చి నుంచి టీవీకే అభ్యర్దిగా పోటీ పైన పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. దీంతో, ఈ నెల 11న తాను ఈ అంశం పైన స్పందిస్తానని.. తన భవిష్యత్ పైన పూర్తి స్పష్టత ఇస్తానని చెప్పారు. కాగా.. ఈ రోజు మరో అప్డేట్ ఇచ్చారు. తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. దీంతో.. అసలు రాఘవ లారెన్స్ పొలిటికల్ ఎంట్రీ పైన సస్పెన్స్ కొనసాగుతోంది.
తమిళనాడు ఎన్నికల్లో గెలిచి సీఎం అయిన విజయ్ ఆ ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి పోటీ చేసారు. రెండింటా విజయం సాధించారు. అందులో తిరుచ్చి సీటుకు రాజీనామా చేసారు. ఆరు నెలల్లోగా ఈ సీటుతో పాటుగా విజయ్ కు మద్దతుగా రాజీనామా చేసిన అయిదుగురు అన్నా డీఎంకే ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోనూ ఎన్నికలు రానున్నాయి. అయితే.. విజయ్ రాజీనామా చేసిన తిరుచ్చి స్థానం నుంచి టీవీకే అభ్యర్దిగా డ్యాన్సర్, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ బరిలోకి దిగుతారనే ప్రచారం సాగుతోంది. విజయ్ తో రాఘవ లారెన్స్ కు సన్నిహిత సంబంధాలు ఉన్న నేపథ్యంలో అందరూ ఇక ఖాయమని భావించారు. కాగా.. నాలుగు రోజుల క్రితం ఈ ప్రచారం పైన స్పందించిన లారెన్స్ పొలిటికల్ ఎంట్రీ.. పోటీ పైన జూన్ 11న తన నిర్ణయం వెల్లడిస్తానని తొలుత చెప్పారు. అయితే.. ఆ రోజు సమీపిస్తున్న తరుణంలో తాజాగా.. ఆయన తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు.

ఉప ఎన్నికలో పోటీకి సిద్దం అవుతున్న లారెన్స్
https://twitter.com/offl_Lawrence/status/2064594644256833791ఈ మేరకు సోషల్ మీడియా లో పోస్టు చేసిన లారెస్స్ నెల 12న(శుక్రవారం) ఉదయం 10:00 గంటలకు తన నిర్ణయాన్ని వెల్లడించనున్నట్లు స్పష్టత ఇచ్చారు. 'అందరికీ నమస్కారం! జూన్ 11న ఉదయం 9:30 గంటలకు నా జీవితంలో ఓ ముఖ్యమైన నిర్ణయాన్ని ప్రకటించబోతున్నట్లు నేను గతంలో చెప్పాను. ప్రస్తుతం చిత్ర పరిశ్రమ అంతా భారతీరాజా సర్ మరణంతో తీవ్ర విషాదంలో మునిగిపోయింది. నేను నా కుటుంబ సభ్యుడిని కోల్పోయినంత బాధతో ఉన్నాను. ఆయనపై ఉన్న గౌరవంతో, సినిమాకు ఆయన అందించిన సహకారానికి గుర్తుగా, నేను నా ప్రకటనను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నాను. నా ఈ ప్రకటనను ఈ నెల 12న(శుక్రవారం) ఉదయం 10:00 గంటలకు తెలియజేస్తాను' అని లారెన్స్ పేర్కొన్నారు. అయితే, లారెన్స్ టీవీకేలో చేరటం.. తిరుచ్చి నుంచి పోటీ చేయటం ఖాయమని భావిస్తున్నారు. దీంతో.. లారెన్స్ ఇదే అంశం పైన ప్రకటన చేస్తారా.. ట్విస్ట్ ఇస్తారా అనేది ఆసక్తిగా మారుతోంది.












Click it and Unblock the Notifications