కర్నూలు కలెక్టర్ పై నిరసన వెల్లువ
కర్నూలుః శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తున్నవిద్యార్థులపై కర్రఝుళిపించిన కర్నూలు కలెక్టర్ సాయిప్రసాద్ పై నిరసన వెల్లువెత్తుతున్నది.విద్యార్థులపై చేయిచేసుకున్న కలెక్టర్ ను సస్పెండ్ చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమండ్ చేసింది. కలెక్టర్ చర్యకు నిరసనగా మంగళవారం నాడు కర్నూలులో పాఠశాలల బంద్ జరిగింది. ఎబివిపి, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో దాదాపు అన్ని పాఠశాలలు మూతపడ్డాయి. కర్నూలు జిల్లా కల్లూలు జడ్.పి. పాఠశాల పూరిగుడిసెలో నడుస్తున్నది. 600 మందివిద్యార్థులు వున్న ఈ పాఠశాలకు పక్కా భవనం నిర్మించాల్సిందిగా కోరుతూ ఎబివిపి కార్యకర్తలు సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు.
కలెక్టర్ వ్యవహారశైలికి నిరసనగా జిల్లాలోనివిద్యార్థి సంఘాలు రణభేరి మోగించాయి. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా కలెక్టర్ చర్యకు నిరసన వ్యక్తం చేశారు.విద్యార్థుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన కలెక్టర్ సాయిప్రసాద్ ను సస్పెండ్ చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ లో డిమాండ్ చేసింది. వామపక్షాలు కూడా కలెక్టర్ చర్య పట్ల తీవ్ర నిరసన ప్రకటించాయి.












Click it and Unblock the Notifications