ప్రధానిని కలిసిన దేశం ఎంపిలు
న్యూఢిల్లీః రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్ధితిని తెలుగుదేశం పార్టీకి చెందిన ఎం.పి.లు మంగళవారం ప్రధానికివివరించారు. ఎర్రంనాయుడు సారధ్యంలోని తెలుగుదేశం ఎం.పి.ల బృందం ప్రధానిని ఆయన నివాసంలో కలుసుకున్నది. ఎం.పి.ల వెంట రాష్ట్ర మంత్రులు వడ్డే శోభనాద్రీశ్వరరావు,అశోక్ గజపతిరాజు కూడా వున్నారు. రాష్ట్రంలో కరవు పరిస్థితి తీవ్రంగా వున్నదని, భారీ మొత్తంలో ఆర్థిక సాయం చేయాలని వారు ప్రధానినికోరారు. రాష్ట్రానికి 80 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని కేంద్రం ఇప్పటికే ప్రకటించినవిషయం విదితమే. అయితే 850కి పైగా మండలాల్లో కరవు నెలకొన్న దరిమిలా రాష్ట్రానికి 810 కోట్ల రూపాయలు ఇవ్వాలని రాష్ట్ర క్యాబినెట్ కేంద్రాన్ని కోరింది.












Click it and Unblock the Notifications