బడికి పంపకుంటే పోరాడండిః బాబు
మహబూబ్ నగర్‌ః చదువు చెప్పించకుండా పనికి పంపే తల్లిదండ్రులపై తిరగబడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిల్లలకు ఉద్బోధించారు. చదువుకోకపోతే భవిష్యత్తు అంధకారం అవుతుందని మహబూబ్ నగర్ లో వివిధ చదువుల పండుగ కార్యక్రమాల్లో పాల్గొన్న చంద్రబాబు నాయుడు చెప్పారు. చదివించని తల్లిదండ్రులపై తిరగబడాలని ఆయన సూచించారు.
పది మంది బాలకార్మికులను బడిలో చేర్పించిన ఇద్దరువిద్యార్థులకు చంద్రబాబు నాయుడు నగదు బహుమతి ఇచ్చారు. మహబూబ్ నగర్ లో ఎన్టీఆర్ మహిళాడిగ్రీ కళాశాలను చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. అనంతరం భూత్పూర్ గ్రామంలో చంద్రబాబు నాయుడు గ్రామసభ నిర్వహించారు. అవసరమైన చోట్ల జూనియర్ కళాశాలలు, పాఠశాలలు ప్రారంభిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications
