మంత్రులకు ఆహారం అవుతున్న బియ్యం!
హైదరాబాద్‌ః పనికి ఆహారపధకంలో జరుగుతున్న అవకతవకలపై తక్షణంవిచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. పార్టీ అధికార ప్రతినిధి రోశయ్య బుధవారంవిలేకర్లతో మాట్లాడుతూ పనికి ఆహార పథకంలో జరుగుతున్న అవకతవకల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన మంత్రుల హస్తం కూడా వున్నదన్నారు.
విద్యుత్ మంత్రితో పాటు పలువురు రాష్ట్ర మంత్రులకు పనికి ఆహారం పథకంలో జరుగుతున్న అవకతవకలతో సంబంధం వున్నదని ఆయన చెప్పారు. ప్రజల నోళ్ళు కొడుతున్న ఈ మంత్రులను మంత్రివర్గం నుంచి తప్పించాలని కాంగ్రెస్ కోరింది. వారిని క్యాబినెట్ లో కొనసాగించడం చూస్తే ఈ అవకతవకలతో చంద్రబాబుకు కూడా సంబంధం వున్నట్లు అనుమానం వస్తున్నదని రోశయ్య అన్నారు.












Click it and Unblock the Notifications
