ముంబాయిః భారీ వర్షాల కారణంగా ముంబాయిలోని కుర్లాలో బుధవారం ఉదయం కొండచరియ విరిగిపడి ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మరో పదిమంది కూలిన మట్టిపెల్లల కిందఇరుక్కుపోయారు.
భారీ వర్షాల కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు చెప్పారు. ఇదిలా వుండగా భారీ వర్షాల కారణంగా ముంబాయిలో సాధారణ జనజీవితం దాదాపుగా స్తంభించిపోయింది. లోకల్‌రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. అనేక ప్రాంతాలు జలమయం కావడంతో ట్రాఫిక్ నత్తనడక నడుస్తున్నది.