పార్లమెంట్ మళ్లీ వాయిదా
న్యూఢిల్లీః పెట్రోల్ బంకుల స్కామ్ బుధవారం నాడు కూడా పార్లమెంట్ ఉభయ సభను కుదిపివేసింది. రెండు సభలు గురువారానికి వాయిదా పడ్డాయి. పెట్రోలియం శాఖ మంత్రి రామ్‌నాయక్ రాజీనామా చేయాల్సిందేనని రెండుసభల్లోనూ ప్రతిపక్షాలు గట్టి పంతం పట్టాయి.
సమావేశం కాగానే పెట్రోల్ బంకుల స్కామ్‌ను విపక్షాలు లేవనెత్తాయి. అయితేమిలిటెంట్ల దాడిలో మరణించిన యాత్రికులకు సంతాపం తెలియజేయాలని సభాపతి స్థానంలో వున్న డిప్యూటి చైర్మన్ నజ్మా హెప్తుల్లా పదేపదేవిజ్ఞప్తి చేసిన తర్వాత విపక్షాలు అందుకు అంగీకరించి రెండు నిమిషాల మౌనం పాటించాయి. ఆ తర్వాత ప్రశ్నోత్తరాల్లోకి వెళ్లడానికి నజ్మా ప్రయత్నించగావిపక్షాలు అడ్డుకున్నాయి. సభ్యులకు సర్ధి చెప్పడానికి చేసిన ప్రయత్నాలువిఫలం కావడంతో సభను గురువారానికి వాయిదా వేస్తున్నట్టుగా ఆమె ప్రకటించారు. లోక్‌సభలో కూడా దాదాపు అదే పరిస్థితి కనిపించింది.స్పీకర్ మనోహర్ జోషి సభలో గందరగోళాన్ని తట్టుకోలేక సభను గురువారానికి వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications
