ప్రధానితో ఆంధ్ర కమలనాధుల భేటి
న్యూఢిల్లీః కరవుకోరల్లో చిక్కుకొని విలవిలలాడుతున్న ఆంధ్రప్రదేశ్ ను తక్షణం ఆదుకోవాల్సిందిగా రాష్ట్రబిజెపి ప్రధానిని కోరింది. కేంద్రరైల్వే శాఖసహాయ మంత్రి దత్తాత్రేయ, హోం శాఖ సహాయ మంత్రివిద్యాసాగర్ రావు తదితర బిజెపి నేతలు గురువారం ప్రధాని వాజ్‌పేయిని ఆయన నివాసంలో కలిశారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులతో పాటు రాష్ట్ర బిజెపి నేతలు కూడా ప్రధానిని కలిసిన వారిలో వున్నారు. కరవు సాయం కోసంపెద్ద మొత్తంలో నిధులు కేటాయించడంతో పాటు పనికి ఆహారపథకం కింద మరింత బియ్యం కేటాయించాలని వారు ప్రధానినికోరారు.












Click it and Unblock the Notifications
