హైదరాబాద్‌ః రాష్ట్రంలో నెలకొని వున్న కరవు పరిస్థితులను ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ పిసిసి సారథ్యంలో గురువారం నాడు హైదరాబాద్‌లో నిరశన దీక్ష సాగింది.
కరవు వాతపడి అల్లాడతున్న ప్రజలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం దారుణంగావిఫలమైందని పిసిసి నేత సత్యనారాయణరావువిమర్శించారు. రాష్ట్రంలో కృష్ణా, గోదావరి, తుంగభద్ర వంటి అనేక మహానదులు వున్నా ప్రాజెక్టులు నిర్మించకుండా ప్రభుత్వం రకరకాలస్కీమ్‌లతో ప్రజలను మభ్యపెడుతున్నదని ఎంఎస్‌ఆర్ నిందించారు. ప్రాజెక్టులను కడితే సాగునీరు లభించడంతో పాటువిద్యుత్ ఉత్పత్తికి కూడా అవకాశం లభిస్తుందని ఎంఎస్‌ఆర్ అన్నారు.