నా ప్రమేయం లేదు:విద్యాసాగర్
హైదరాబాద్:పెట్రోల్ పంపుల కేటాయింపులో తన ప్రమేయం లేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిసిహెచ్. విద్యాసాగర రావు స్పష్టం చేశారు. పెట్రోల్ డీలర్లపేర్ల చివర రావు అని ఉన్నవారందరూ తన వారని అనుకోవడం సరికాదని, అటువంటి వారితో తనకు ప్రమేయం లేనది ఆయన శనివారంవిలేకరుల సమావేశంలో అన్నారు.
దున్నగలిగే వానికి భూమి రెండవ దశ కార్యక్రమాన్ని ఈ నెల 19వ తేదీన ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. మొదటి విడత కార్యక్రమంలో జరిగిన లోపాలను, అవకతవకలను రెండవ విడత కార్యక్రమంలో జరగనివ్వబోమని ఆయన అన్నారు. రెండవ విడత కార్యక్రమాన్ని కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం మర్పల్లిలో ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications
