న్యూఢిల్లీః జమ్మూ కాశ్మీర్‌లో ఎన్నికల నిర్వహణకు విదేశీ పరిశీలకులను అనుమతించాలనే ప్రతిపాదనను కేంద్రం నిర్ద్వంద్వంగా తిరస్కరించింది.
జమ్మూకాశ్మీర్‌లో ఎన్నికలను సవ్యంగా సాఫీగా నిర్వహించడం తమ బాధ్యత అని ఈవిషయంలో విదేశాల సలహాలు, సూచనలు సర్టిఫికెట్లు తమకు అవసరం లేదని విదేశాంగ శాఖ సహాయ మంత్రి దిగ్విజయ్‌సింగ్ స్పష్టం చేశారు. జర్నలిస్టులు దేశంలోని ఏ ప్రాంతానికైనాస్వేచ్చగా వెళ్లవచ్చని అందుకు ప్రభుత్వం అడ్డంకులు కల్పించదని ఆయన స్పష్టం చేశారు.