హైదరాబాద్‌ః గత అయిదు రోజులుగా సాగుతున్న సింగరేణి కార్మికుల సమ్మె శనివారం నాడు పరిష్కారమైంది. కార్మికుల ప్రధాన డిమాండ్లను యాజమాన్యం ఆమోదించడంతో సమ్మె విరమిస్తున్నట్టుగా ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి.
కొన్ని డిమాండ్లను తర్వాత దశల్లో తీర్చడానికి యాజమాన్యంఅంగీకరించినట్టుగా కార్మిక సంఘాల నేతలు చెప్పారు. ఉద్యోగులు కోరినట్టుగా ప్రతి కార్మికుని కుటుంబానికి 150 యూనిట్లవిద్యుత్‌ను ఉచితంగా ఇవ్వడానికి అంగీకరించారు. దీనివల్ల సంస్థలపై అదనంగా 30 కోట్ల రూపాయల భారం పడుతుంది.అయిదు రోజుల సమ్మె వల్ల సంస్థకు 25 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్టుగా సింగరేణి ప్రతినిధి చెప్పారు.