రాష్ట్రపతి గుజరాత్‌ పర్యటన

అహ్మదాబాద్‌ః అసాధారణ భద్రతా ఏర్పాట్లు, మోడి ప్రభుత్వ ముందు జాగ్రత్త చర్యల మధ్య రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం గుజరాత్‌ పర్యటన ప్రారంభమైంది. గాంధీజీ సబర్మతీ ఆశ్రమంలో వందలాది మంది విద్యార్ధులతో ఆయన ఉత్సాహంగా ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. నవభారతాన్ని గురించి విద్యార్ధులతో ఆయన తన ఆలోచనలను పంచుకున్నారు.

గాంధీ, విక్రమ్‌ సారాభాయ్‌ని ఆదర్శంగా తీసుకోవాలని ఉద్భోదించారు. సోమవారం నాడు ఆయన రెండు రోజుల అధికార పర్యటన కోసం అహ్మదాబాద్‌కు చేరుకున్నారు. ముఖ్యమంత్రి నరేంద్ర మోడి, గవర్నర్‌ బండారీ ఆయనకుస్వాగతం చెప్పారు. ముందుగా సబర్మతి ఆశ్రమానికి చేరుకుని జాతిపితకు నివాళులర్పించిన కలాం అక్కడి నుంచి ఘర్షణలు చెలరేగిన ప్రాంతాలను సందర్శించి సహాయ పునరావాస కార్యక్రమాలను సమీక్షించారు. గత నెలలో రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలుస్వీకరించిన తర్వాత అబ్దుల్‌ కలాం ఢిల్లీకి ఆవల జరుపుతున్న తొలి అధికారిక పర్యటన కావడంతో ఈ పర్యటనకు కొంత ప్రాధాన్యత ఏర్పడింది. దానికన్నా మతఘర్షణలతో నెత్తురుమడుగులు కట్టిన గుజరాత్‌ పర్యటనలో రాష్ట్రపతి ప్రతిస్పందన ఏవిధంగా వుంటుందనేఅంశాన్ని ఇప్పుడు అంతా ఆసక్తితో గమనిస్తున్నారు. నోరువిప్పి శాంతి భద్రతల పరిస్థితిపై ఆయన ఒక్క మాట మాట్లాడినా ఎన్‌డిఎ సర్కారు పరిస్థితి దారుణంగా వుంటుంది. రాష్ట్రపతి పర్యటనను పురస్కరించుకుని మోడి ప్రభుత్వం ఆయన తిరగడానికి అవకాశం వున్న ప్రాంతాలను లక్షలాది రూపాయలు వెచ్చించిసర్వాంగసుందరంగా తీర్చిదిద్దింది.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+