కరెంట్‌ షాక్‌కు ఎనిమిది మంది బలి

చిత్తూరు ః చిత్తూరు జిల్లా నెల్లిమంద గ్రామంలో ఒక ట్రాక్టర్‌ ట్రాలీ సోమవారంనాడు ఉదయం కరెంట్‌ తీగకు తాకిన సంఘటనలో అందులో వున్న ఎనిమిది మంది కరెంట్‌ షాక్‌తో మరణించారు. గంగమ్మ జాతరలో ఈ దారుణ సంఘటన జరిగింది.

వందలాది మంది ప్రజలు పాల్గొన్న ఈ జాతరలో రికార్డింగ్‌ డాన్సులు నిర్వహించారు. కొందరు యువకులు ట్రాక్టర్‌ ట్రాలీలో దేవతా మూర్తులవిగ్రహాలను ఊరేగింపుగా తీసుకుని జాతరకు వస్తున్న సమయంలో కరెంట్‌ తీగ తెగిపడి ట్రాక్టర్‌కు తగిలింది. ఆ సమయంలో ట్రాక్టర్‌లో వున్న ఎనిమిది మంది తీవ్రమైన గాయాలతో అక్కడికక్కడే మరణించారు. షాక్‌ కారణంగా ఒళ్లంతా కాలిన గాయాలతో మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన జిల్లాలో తీవ్ర దిగ్భ్రాంతిని సృష్టించింది. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం వివిధ పథకాల కింద లక్షరూపాయల చొప్పునఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ప్రస్తుతం విదేశీ పర్యటనలో వున్న ముఖ్యమంత్రి చంద్రబాబు సంఘటనవివరాలను తెలసుకుని బాధితులకు సహాయ పునరావాస కార్యక్రమాలు చేపట్టాల్సిందిగా ఆదేశించారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+