న్యూఢిల్లీః తూర్పు, ఆగ్నేయ రైల్వే జోన్ల విభజను వ్యతిరేకిస్తూ తృణమూల్ కాంగ్రెస్ నాయకులు, ఎన్నికైన ప్రజాప్రతినిధులు సోమవారం ఢిల్లీలో పార్లమెంట్ హౌస్ సమీపంలో ప్రదర్షనను జరిపారు.
రైల్వే మంత్రి నితీష్ కుమార్ రాజీనామా చేయాలని తృణమూల్ నేత మమతాబెనర్జీ గట్టిగా డిమాండ్ చేశారు. కోల్‌కతా మేయర్ సుబ్రతో ముఖర్జీతో సహా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు.