వరంగల్‌ః వరంగల్‌లోని వడ్డేపల్లిలో వున్న పురాతన డిగ్రీ కాలేజీ భవనంలోని కొంత భాగం మంగళవారం నాడు హఠాత్తుగా కూలిన సంఘటనలో ముగ్గురు విద్యార్ధినులు గాయపడ్డారు.
70 మంది విద్యార్ధులు తృటిలో ప్రమాదం తప్పించుకున్నారు. సుమారు వందేళ్ల క్రితం నిజాం హయాంలో నిర్మించిన ఈ భారీ భవనం నివాస యోగ్యం కాదనిఆర్‌అండ్‌బి అధికారులు చాలా కాలం క్రితమే చెప్పినప్పటికీవిద్యాశాఖ అధికారులు మరమ్మత్తులకు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లుకు చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ దుర్ఘటన జరిగిందని కాలేజీవిద్యార్ధులు ఆరోపించారు. భవనం కూలిన స్థలంలోనే 70 మందివిద్యార్ధులు అంతకు ముందే క్లాస్ పూర్తి చేసుకుని బయటకు వెళ్లడంతోపెను ప్రమాదం తప్పింది.