ఇస్లామాబాద్: అమెరికా దౌత్య కార్యాలయం ఇస్లామాబాద్‌లోని అమెరికన్‌సెంటర్‌ను మూసివేసింది. ఇస్లామిక్ మిలిటెంట్ల దాడి భయంతో ఈసెంటర్‌ను మూసివేశారు.
గత వారం కరాచీలోని కాన్సులేట్ మూసివేత, క్రిస్టియన్ సంస్థపై దాడి నేపథ్యంలో తాజాగా అమెరికన్‌సెంటర్‌ను మూసివేశారు. భద్రతా కారణాల రీత్యా తిరిగి ఆదేశాలు జారీ అయ్యే వరకు అమెరికన్‌సెంటర్‌ను మూసివేస్తున్నట్లు అమెరికా దౌత్య కార్యాలయం యాక్టింగ్ ప్రజా వ్యవహారాల అధికారి చెప్పారు. ఈవిషయాన్ని స్థానిక దినపత్రిక డాన్ రాసింది. సిబ్బంది పని చేస్తూనే ఉంటారని ఆమె చెప్పారు. ప్రస్తుతం లాహోర్,పెషావర్‌లలోని అమెరికన్ సెంటర్లు తెరిచే ఉంటాయని ఆమె చెప్పారు.