మాస్కో: అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామాబిన్ లాడెన్, తాలిబాన్ అధినేత ముల్లా ఉమర్ మరణించి వుండవచ్చునని పాకిస్థాన్ అధ్యక్షుడుపర్వేజ్ ముషార్రఫ్ అన్నారు.
లాడెన్, ఒమర్ ఎక్కడ ఉన్నారనే సమాచారం ఏ ఒక్కరికి కూడా లేదని ఆయన అన్నారు. బహుశా వారు జీవించి ఉండకపోవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు. రష్యాలోని దిన పత్రికఇజ్వెస్టియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆ విధంగా అన్నారు.సెప్టెంబర్ దాడుల్లో ప్రధాన నిందితులైన లాడెన్‌ను, ఒమర్‌నుఅరెస్టు చేసే అవకాశాలున్నాయా అనే ప్రశ్నకు ఆయన ప్రతిస్పందించారు. పాకిస్థాన్‌స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆయన ఆ దినపత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు.