టిఎంసి విలీనం ఆనందం: సోనియా
చెన్నై: తమిళ మనీలా కాంగ్రెస్ (టిఎంసి) తిరిగి కాంగ్రెస్ కుటుంబంలో చేరుతుండడం పట్ల కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ హర్షం వ్యక్తం చేశారు. ఇది తనకెంతో ఆనందంగా ఉన్నదని ఆమె అన్నారు.
కాంగ్రెస్ పార్టీ మరింత పటిష్టమవుతుందనేవిశ్వాసం ఉన్నదని, ఈ దిశలో తాము మరింత కృషి చేస్తామని ఆమె అన్నారు. ఐక్యంగా పని చేసి రాష్ట్రంలో పార్టీని పటిష్టం చేయాలని ఆమె కాంగ్రెస్ కార్యకర్తలనుకోరారు. ఎఐసిసి కార్యదర్శి, తమిళనాడు పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి రమేష్ చెన్నితాల ఆమె వెంట ఉన్నారు.












Click it and Unblock the Notifications
